కబడ్డీ కోచ్‌గా మారిన తమన్నా… అదిరిన ‘సీటీమార్’ ఫస్ట్‌లుక్..

0
41

జ్వాలా రెడ్డి అనే కబడ్డీ కోచ్‌గా తమన్నా. మాచో స్టార్ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో ‘సీటీమార్’ అనే సినిమా వస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌‌లో పాత్రలో నటిస్తోంది. దీనికి సంబందించి ఇటీవలే ఫస్ట్‌లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ ఫస్ట్ లుక్‌లో గోపిచంద్ మెడలో విజిల్‌తో కోచ్‌గా అదరగొట్టాడు. సీటీమార్ బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుందట. హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. గత చిత్రాలకు భిన్నంగా గోపి చంద్ మొదటిసారి స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు.

కాగా ఈ చిత్రంలో లేడీ కబడ్డీ కోచ్ రోల్‌లో హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో ఆమెకు సంబందించిన లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ లుక్‌లో తమన్నా రెడ్ డ్రెస్‌లో కోపంగా చూస్తూ మెడలో హెడ్ ఫోన్స్‌తో అదరగొడుతోంది. ఈ చిత్రంలో తమన్నా జ్వాలా రెడ్డి అనే కబడ్డీ కోచ్‌గా నటిస్తోంది. ఆమ్ రోల్ కూడా ఈ చిత్రంలో సీరియస్ నెస్ తో కూడుకున్న ఇంటెన్సిటీతో ఉంటుందని అర్థం అవుతుంది. ‘సీటీమార్’‌కు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.