సీఎం జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విజయ్ కలిసి పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో కొందరు ఆకతాయిలు ఏర్పాటు చేసిన ఈ పోస్టుర్లు ఇప్పుడు తమిళ, తెలుగు రాష్ట్రాల రాజీకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మధురై ప్రాంతంలో మగ్గురు ఫోటోలతో కలిపి పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లో మధ్యలో తమిళ్ సూపర్ స్టార్ విజయ్ కూర్చుండగా… ఓ పక్కనే జగన్, మరో పక్కనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కనిపిస్తున్నారు. ఏపీని మేం కాపాడుకున్నాం… ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడును మీరే కాపాడలంటూ… విజయ్ అభిమానులు కొందరు ఈ పోస్టర్లను అతికించినట్లు తెలుస్తోంది. ఈ మాట జగన్, పీకే కలిసి… విజయ్‌కు చెప్పినట్లుగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన బిగ్ పోస్టర్ హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
తమిళ్ హీరో విజయ్‌పై ఇటీవలే ఐటీ దాడులు చేసింది. ఆయనకు నోటీసులు కూడా అందించింది. అయితే తమ అభిమాన హీరోను బీజేపీ కావాలనే టార్గెట్ చేసిందని ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో ఇప్పడు తమిళనాడులో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తొలగించాలంటే హీరో విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.