వివాహ విందులో చికెన్ కూర చిచ్చు.

0
31

చికెన్ కూర ఓ పెళ్లివిందులో పెనుదూమారాన్ని లేపింది. చికెన్ కూర దగ్గర మొదలైన గొడవ.. రాళ్లు విసురుకుని కేసులు నమోదు చేసుకునే స్థాయికి వెళ్లింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సారవకోట రెల్లి వీధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సారవకోట రెల్లి వీధికి చెందిన సురేష్‌కు బూర్జ మండలం ఉప్పెనవలస గ్రామానికి చెందిన యువతితో వివాహం చేసేందుకు నిర్ణయించారు. వివాహ వేడుకలో భాగంగా సారవకోటలోని వరుడి ఇంటి వద్ద బుధవారం మధ్యాహ్నాం వివాహ విందును ఏర్పాటుచేశారు.

అయితే భోజన సమయంలో చికెన్ కూర ఎక్కువగా వేయలేదని పెళ్లికుతూరు తరపున వచ్చిన ఓ వ్యక్తి కోరారు. అప్పటికే చికెన్ తక్కువగా ఉండడం.. చికెన్ వేయాలని అడిగిన వ్యక్తి ప్లేట్‌లో చికెన్ ఉండడంతో ముందు ఉన్నది తినగానే వేస్తానని భోజనం వడ్డిస్తున్న వరుడి తరపు వ్యక్తి అన్నాడు. వధువు తరపు వ్యక్తి కూర వేయలేదన్న కోపంతో ప్లేట్‌ను భోజనం వడ్డిస్తున్న వ్యక్తిపైకి విసిరికొట్టాడు. దీంతో చిన్న గొడవ కాస్త.. ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు రెల్లివీధికి వెళ్లి కొంతమందిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. పెళ్లికూతురు తరపు వారినే స్టేషన్‌కు తీసుకురావడం ఏంటని వధువు తరపు బంధువులు స్టేషన్‌కు చేరుకున్నారు. ఇదే క్రమంలో వరుడి తరుపు బంధువులు స్టేషన్‌కు వచ్చారు.