సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక తన స్టైల్లో విజయ్ దేవరకొండ నిర్వహించిన ప్రమోషన్స్ సినిమాపై విపరీతమైన బజ్, హైప్‌ను క్రియేట్ చేశాయి. వాలంటైన్స్ డే కానుకగా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా టిక్కెట్ ధరలు పెంచినప్పటికీ బుకింగ్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఓపెనింగ్ డే అన్ని ఏరియాల్లో థియేటర్లు నిండిపోతున్నాయి. హైదరాబాద్‌లో అయితే ఆల్‌మోస్ట్ థియేటర్లు ఫుల్ అయిపోయాయి. ఒక్క హైదరాబాద్‌లోనే తొలిరోజు సుమారు 500 షోలు పడుతుండగా ఇప్పటికే 400కు పైగా షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. దీన్ని బట్టి విజయ్ దేవరకొండ సినిమాలకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీమియర్ షోలు ఇప్పటికే యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూస్తున్న వాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి ఫస్టాఫ్‌పై మిక్స్‌డ్ రిపోర్ట్ బయటికి వచ్చింది. ఫస్టాఫ్ అదిరిపోయిందని కొంతమంది అంటుంటే.. పర్వాలేదు అని మరికొందరు అంటున్నారు. విజయ్ దేవరకొండ తన నటనతో కట్టిపడేశారట. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ అద్భుతంగా చేశారని కొనియాడుతున్నారు. డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఫస్టాఫ్ పర్ఫెక్ట్ బేస్‌ను ఏర్పరిచారట.