ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ చేస్తూ… టిక్ టాక్…

0
37

తెలంగాణ… హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓ టిక్ టాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో RMO డాక్టర్, ఆయన బృందం సర్జరీ చేస్తూ… టిక్ టాక్ వీడియో చెయ్యడం దుమారం రేపింది. ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ చేస్తూ… టిక్ టాక్ చెయ్యడమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు. ఈ వీడియోలో… డాక్టర్, ఆయన బృందం ఆపరేషన్ చేస్తున్నట్లు కనిపిస్తున్నా… తమిళ హీరో విజయ్ తెలుగు డైలాగ్స్ టిక్ టాక్ వీడియోలో వినిపిస్తున్నాయి. డాక్టర్లు టిక్ టాక్ వీడియో కోసం పోజులు ఇచ్చినట్లుగా ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది.


RMO డాక్టర్ మాత్రం ఈ వీడియోతో తనకు ఎలాంటి సంబంధమూ లేదంటున్నారు. అసలు తాము టిక్ టాక్ వీడియో చెయ్యనే లేదని అంటున్నారు. ఎవరో తమకు తెలియకుండా ఈ వీడియో తీసి… దీనికి విజయ్ డైలాగ్స్ సెట్ చేసి… టిక్‌టాక్‌లో పెట్టారని అంటున్నారు. ఈ విషయంలో ఏది నిజమో తేల్చాలని నెటిజన్లు కోరుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దానికీ ఈ ఘటనకూ సంబంధం లేకపోయినా… ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే… ఇలాంటి వీడియో రావడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి దీనిపై ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశిస్తుందా లేదా అన్నది త్వరలో తేలుతుంది. ఒకవేళ డాక్టరే ఈ వీడియో చేయించి ఉంటే… ఆయన్ని సస్పెండ్ చేసే అవకాశాలుంటాయి. అలా కాకుండా డాక్టర్ ఆరోపించినట్లు ఎవరైనా ఆకతాయి ఈ పని చేసివుంటే… చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి.