డోనాల్ట్ ట్రంప్ కు స్పెషల్ గిఫ్ట్… సీఎం కేసీఆర్.

0
63

భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, కూతురు ఇవాంకకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పెషల్ గిఫ్ట్ అందించనున్నారు. పర్యటన సందర్భంగా ట్రంప్‌కు రేపు సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు మహారాష్ట్ర, ఒడిసా, కర్ణాటక, తమిళనాడు, అసోం, బిహార్, హరియాణా రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం అందింది. దీంతో సీఎం కేసీఆర్ ఆ విందులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో పాటు మెలానియా, ఇవాంకకు ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వనున్నారు. ట్రంప్‌కు పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మెమెంటో అందించనున్నారు.

అనంతరం.. మెలానియాకు, ఇవాంకకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోచంపల్లి, గద్వాల్ చీరలను బహూకరించనున్నారు. కాగా, విందులో తెలంగాణ వంటకాలు కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, విందులో పాల్గొననున్న సీఎం ఎల్లుండి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.