బైక్‌ చక్రంలో చీర చిక్కుకోని మహిళ మృతి.

0
29

దారుణం..నడుస్తున్న బైక్‌ వెనక చక్రంలో చీర చిక్కుకోవడంతో, కిందపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది. అజాగ్రత్త ఓ మహిళ ప్రాణాన్ని తీసింది. నడుస్తున్న బైక్‌ వెనక చక్రంలో చీర చిక్కుకోవడంతో, కిందపడి ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం పొడిచేడు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి బైక్ పై కుటుంబంతో భార్య భర్తలు వెళ్తున్నారు. ఆత్మకూర్(ఎం) జెఏఎస్ ఫంక్షన్ హాల్ వద్దకు రాగానే చీర కొంగు బైక్ వెనుక చక్రంలో చుట్టుకోవడంతో ఆ మహిళ వెనుక పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి. 108 ఆంబులెన్సు అందుబాటులో లేక పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో హుటాహుటిన భువనగిరికి తరలించగా మార్గమధ్యంలో మరణించింది.