ఏపీ సీఎం జగన్‌పై టిక్ టాక్… వీడియో…

0
47

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, అనుకూలంగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు, వీడియోలూ రావడం సహజం. వాటిలో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నా… పోలీసులు పోనీలే అని ఆయా వ్యక్తుల జోలికి వెళ్లకుండా జాలి చూపిస్తున్నారు. ఐతే… శృతి మించితే మాత్రం తాట తీస్తున్నారు. తాజాగా అదే జరిగింది. కడప జిల్లా… దువ్వూరికి చెందిన ఓ వ్యక్తి… సీఎం జగన్‌కి వ్యతిరేకంగా… అసభ్యకరంగా మాట్లాడుతూ… టిక్ టాక్ చేశాడు. అది సోషల్ మీడియా ద్వారా… షేర్ అయ్యింది. అనోటా ఈనోటా వినపడుతూ… చివరకు దువ్వూరు మండలం… పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నాయుకుడు జయచంద్రారెడ్డి దృష్టికి వెళ్లింది. ఏంటా వీడియో అని చూశారాయన. షాక్ అయ్యారు. ఆ మాటలేంటి? ఆ వీడియో ఏంటి? సీఎం పాలనపై అభ్యంతరాలుంటే… రాజ్యాంగ బద్ధంగా విమర్శలు చెయ్యాలి గానీ… ఇలా అసభ్యకరంగా మాట్లాడటమేంటి? అంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

అటు ఏపీ, ఇటు తెలంగాణలో పోలీసులు ఈ రోజుల్లో చాలా అలర్ట్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాపై పెద్ద నిఘాయే నడుస్తోంది. ఎంప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో… ఇమ్మీడియట్లీ… సైబర్ టీమ్‌కి మెసేజ్ వెళ్లింది. వాళ్లు ఆ వీడియోని చూసి… దాన్ని ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేసిందీ క్షణాల్లో తెలుసుకున్నారు. ఏ మొబైల్ నంబర్‌కి ఉన్న ఇంటర్నెట్ ద్వారా అది అప్‌లోడ్ అయ్యిందో తెలుసుకున్నారు. ఆ మొబైల్ నంబర్ ఎవరిదో కనుక్కున్నారు. ఇప్పుడు ఆ నంబర్ ఉన్న వ్యక్తి ఎక్కడున్నదీ లొకేషన్ ట్రేస్ చేశారు. వెంటనే… డేటా పోలీసులకు మెసేజ్ రూపంలో పంపించారు. పోలీసులు… మైదూకురు పట్టణానికి చెందిన పుల్లయ్య… ఈ పని చేసినట్లు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేశారు.