అదిరిన రామ్ ‘రెడ్’ మూవీ టీజర్.

0
31

ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా తర్వాత రామ్ నటిస్తున్న సినిమా రెడ్. తనకు బాగా కలిసొచ్చిన కిషోర్ తిరుమల దీనికి దర్శకుడు. ఈ సినిమా టీజర్ విడుదలైందిప్పుడు. ఇది చూసిన తర్వాత రామ్‌ మరో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తుంది ఈ చిత్రం. కెరీర్‌లో తొలిసారి అలాంటి జోనర్ ట్రై చేస్తున్నాడు రామ్. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి ఫీల్ గుడ్ సినిమాల తర్వాత కిషోర్ తిరుమల, రామ్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. తమిళనాట సూపర్ హిట్ అయిన తడమ్ సినిమా రీమేక్ ఇది. ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేసాడు రామ్.

నివేదా నివేదా పేతురాజ్, మాళవిక శర్మ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ఈ మధ్యే ఇటలీ వెళ్లి పాట కూడా షూట్ చేసుకుని వచ్చారు యూనిట్. శ్రీ స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 9న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ ఇందులో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ అందించిన సంగీతం సినిమాకు ప్రాణం. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. మొత్తానికి టీజర్ చూస్తుంటే రెడ్‌కు హిట్ కళ ఉట్టిపడుతుంది.