పవన్ కళ్యాణ్, ఓ వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటూనే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించాడు. అందులో భాగంగా MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో నివేదా థామస్, అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోందని సమాచారం. ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కల్యాణ్ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర సంగీత దర్శకుడు థమన్.. ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించాడు. కాగా తాజా సమాచారం మేరకు చిత్ర బృందం మార్చి 2 పవన్ ఫస్ట్‌లుక్‌ను, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న ఫస్ట్సాంగ్ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -