ధోని అభిమానులకు శుభవార్త. IPL 2020 లో ధోని.

0
102

టీమ్‌ఇండియా మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఐపీఎల్‌ లో సత్తా చాటేందుకు సిద్ధమైపోయాడు. ఈ నెల 29న మొదలయ్యే ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం ధోనీ చెన్నై చేరుకున్నాడు. దాదాపు 8 నెలల తర్వాత బ్యాట్‌ పట్టేందుకు చెన్నై చేరుకున్న ధోనీకి ఘనస్వాగతం లభించింది. చెన్నై సూపర్‌‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ అతనికి టీమ్‌ హోటల్లో సాదర స్వాగతం పలికింది. టీమ్‌ సీఈవో కాశీ విశ్మనాథ్ బొకే ఇచ్చి అతడిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో తీసిన అతడి ఫొటో, వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది. భారీ సెక్యూరిటీ నడుమ ధోనీ వెళ్తుండగా కొందరు అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయ్నతించారు. ధోనీ రాకతో చెన్నై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌‌ కింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిలిపిన ధోనీని అక్కడి ఫ్యాన్స్‌.. తలా అని పిలుస్తారు. ధోనీ హోటల్లో అడుగుపెట్టిన వీడియోను చెన్నై ఫ్రాంచైజీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దానికి విజిల్‌పోడు అని హాష్‌ట్యాగ్‌ ఇచ్చింది. ఇప్పుడు ఈ హాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్ అవుతోంది. కాగా, మంగళవారం నుంచి ధోనీ ప్రాక్టీస్‌ మొదలు పెడుతాడని టీమ్‌ సీఈవో తెలిపారు. అలాగే, జట్టు అధికారిక ట్రైనింగ్‌ క్యాంప్‌ ఈ నెల 19న ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ నెల 29న జరిగే సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబైతో చెన్నై తలపడనుంది. మరోవైపు అంబటి రాయుడు సైతం చెన్నైకు చేరుకున్నాడు. ఐపీఎల్‌ ఆరంభానికి చాలా సమయం ఉన్నా బాగా ప్రాక్టీస్‌ చేసేందుకు ధోనీ ముందుగానే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది