కరోనా దెబ్బకు భారీగా పడిపోయిన భీష్మ

0
69

సంక్రాంతికి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి విజయాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలే దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసాయి. ఇలాంటి ఓపెనింగ్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన డిస్కో రాజా, వరల్డ్ ఫేమస్ లవర్, జాను లాంటి సినిమాలు కూడా డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో పూర్తిగా కళ తప్పింది బాక్సాఫీస్. ఇలాంటి సమయంలో కరువు తీర్చేస్తున్నాడు నితిన్. ఈయన నటించిన భీష్మ సినిమా రెండు వారాల్లో 27 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే 20 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే రెండో వారం తర్వాత సినిమా పూర్తిగా డౌన్ అయిపోయింది. ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా థియేటర్లకు ఆడియన్స్ రావడం లేదు.


వారం రోజుల వరకు బాగానే వసూలు చేసినా కూడా ఆ తర్వాత మాత్రం వైరస్ దెబ్బ భారీగానే పడిపోయింది. దాంతో కలెక్షన్లు కూడా భారీగానే పడిపోయాయి. మీడియం రేంజ్ సినిమాకు.. నితిన్ లాంటి హీరోకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం మంచిదే కానీ ఆ జోరు మాత్రం చూపించలేకపోయాడు నితిన్. దానికి కారణం కరోనా. శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని నితిన్ చేసిన సినిమా ఇది. బాక్సాఫీస్ దగ్గర లెక్కలు చూస్తుంటే ఇప్పటికే హిట్ ఖాతాలో చేరిపోయింది కానీ బ్లాక్ బస్టర్ స్టేటస్ మాత్రం మిస్ చేసుకుంది భీష్మ. 35 కోట్ల వరకు వసూలు చేస్తుందనుకున్న సినిమా కాస్తా 27 కోట్ల వరకు వచ్చింది. మూడో వారంలో థియేటర్స్ అన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి.
సినిమా బాగున్నా కూడా కరోనా కారణంగా దర్శక నిర్మాతలు కూడా ఏం చేయలేకపోతున్నారు. నైజాంలో ఇప్పటికే ఈ సినిమా 8 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నైజాం 8.75 కోట్లు.. సీడెడ్ 3.19 కోట్లు.. ఉత్తరాంధ్ర 2.95 కోట్లు.. ఈస్ట్ 1.69 కోట్లు.. వెస్ట్ 1.26 కోట్లు.. కృష్ణ 1.51 కోట్లు.. గుంటూరు 1.78 కోట్లు.. నెల్లూరు 0.76 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా 1.91 కోట్లు.. ఓవర్సీస్ 3 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది భీష్మ. ఇప్పటి వరకు 26.98 కోట్ల షేర్ తీసుకొచ్చింది. రష్మిక గ్లామర్ షో.. నితిన్ పర్ఫార్మెన్స్.. వెన్నెల కిషోర్ కామెడీ భీష్మ సినిమాకు హైలైట్. త్రివిక్రమ్ రేంజ్‌లో వెంకీ కుడుముల కూడా పంచ్ డైలాగులతో పిచ్చెక్కించాడు. ఏదేమైనా కూడా కరోనా దెబ్బ ఈ సినిమాకు గట్టిగానే తగిలింది పాపం.