ఐపీఎల్ మ్యాచ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తి లేదన్న గంగూలీ.

0
98

ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకాలు ఉండవని బీసీసీఐ చీఫ్ గంగూలీ పేర్కొన్నాడు. మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై సందేహాలు వ్యక్తం చేశాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల చూసేందుకు పెద్ద ఎత్తున జనం స్టేడియాలకు వస్తే కరోనా వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉందని రాజేశ్ తోపే అన్నారు. కాబట్టి మ్యాచ్‌ల వాయిదా విషయంలో ప్రభుత్వంతో చర్చిస్తున్నామని, మహారాష్ట్రలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను వాయిదా వేయాలన్న యోచనలో ఉన్నామని తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటికే 15 మంది కరోనా అనుమానితులు ప్రత్యేక పరిశీలనలో ఉన్నారని, 258 మంది డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. అయితే, ఎవరికీ కరోనా ఉన్నట్టు నిర్ధారణ కాలేదన్నారు. మంత్రి రాజేశ్ తోపే చేసిన వ్యాఖ్యలపై గంగూలీ స్పందిస్తూ…ఐపీఎల్ మ్యాచ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తి లేదని తెలిపాడు.

ఈ విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, షెడ్యూలు ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని పేర్కొన్నాడు. అయితే, కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నాడు. కాగా, ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 29న జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై, గతేడాది ఫైనలిస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో కలిపి మొత్తంగా ఏడు మ్యాచ్‌లు రాష్ట్రంలో జరగనున్నాయి.