స్థానిక సంస్థల ఎన్నికల వేళ జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. గవర్నమెంట్ ఆఫీసులకు వైసీపీ రంగులు వేయడంపై కీలక తీర్పు వెలువరించింది. వెంటనే పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి పది రోజుల్లోగా మళ్లీ రంగులు వేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలతో సహా నివేదిక రూపంలో సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. వైసీపీ జెండా రంగు తరహా రంగులు వేయాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ జారీ చేసిన మెమోను రద్దు చేసింది. స్కూళ్లు, పంచాయతీ కార్యాలయాలు, వాటర్ ట్యాంకులకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేయడంపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లే. అటు.. స్థానిక సంస్థలు ఎన్నికలను ఈసీ నిష్పక్షపాతంగా నిర్వహించాలని హైకోర్టు సూచించింది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -