మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇండియన్ బ్యాంక్ షాకిచ్చింది. గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం వేసేందుకు సిద్ధమైంది. గంటా ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. రుణం ఎగవేత కేసులో ఈ నెల 16న ఆస్తుల ఈ-వేలం నిర్వహించనున్నట్లు.. వేలంలో పాల్గొనేందుకు ఈ నెల 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరించేందుకు అవకాశం కల్పించారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనవచ్చని ప్రకటనలో ఇండియన్ బ్యాంక్ ప్రకటనలో పేర్కొంది.
గంటాకు సంబంధించిన ప్రత్యూష కంపెనీ.. ఇండియన్ బ్యాంకులో రూ.141.68కోట్లు రుణం తీసుకుంది.. ఆ అప్పు వడ్డీతో సహా రూ.221 కోట్లకు చేరింది. ప్రత్యూష కంపెనీకి గంటా గతంలో డైరెక్టర్‌గా ఉన్నారు. రుణం ఎగవేయడంతో ఇప్పటికే ఇండియన్ బ్యాంక్ ఆస్తులు స్వాధీనం చేసుకుంది. గంటా శ్రీనివాసరావుతో పాటూ మరో ఏడుగురు డైరెక్టర్ల ఆస్తుల వేలానిక రంగం సిద్ధం సిద్ధమైంది. గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు కూడా ఈ రుణానికి సంబంధించినవి కాదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వేలానికి రానున్న ఆస్తుల్లో ఎమ్మెల్యే గంటాకు పేరిట ఉన్న విశాఖ ఉత్తరనియోజకవర్గంలోని ఫ్లాట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేలం పాటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు కూడా ఈ రుణానికి సంబంధించినవి కాదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వేలానికి రానున్న ఆస్తుల్లో ఎమ్మెల్యే గంటాకు పేరిట ఉన్న విశాఖ ఉత్తరనియోజకవర్గంలోని ఫ్లాట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేలం పాటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన ఆస్తుల వేలం అంశంపై తెరపైకి వచ్చింది. దీనిపై గంటా కూడా వివరణ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారన్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆస్తుల వేలం తెరపైకి వచ్చింది. వేలానికి సంబంధించి విషయాలపై గంటా శ్రీనివాసరావు స్పందించాల్సి ఉంది.