ఆర్ఆర్ఆర్ సినిమాలో రానా కూడా ఉన్నాడా…?

0
51

ఆర్ఆర్ఆర్ సినిమాలో రానాకు జోడిగా ముగ్గురు భామలు నటిస్తున్నారట. ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా నటిస్తున్నారుగా. మరి రానా కూడా నటిస్తున్నాడా అనే డౌట్ పడుతున్నారా. ఏమి లేదు.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి పోటీగా తేజ మరో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇక్కడ ఆర్ఆర్ఆర్ అంటే రాక్షస రాజ్యంలో రావణాసురుడు’. రానాతో తేజ తీయబోయే చిత్రానికి ఇదే టైటిల్ అనుకుంటున్నారట. ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత తేజ, రానా కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కించిన ‘సీత’ సినిమా అనుకున్న విజయం సాధించలేదు. దీంతో తేజ.. మరో మంచి కథను రెడీ చేసుకొని రానాకు వినిపించి ఓకే చేయించుకున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీఫియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈచిత్రాన్ని కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో డి.సురేష్ బాబు నిర్మించనున్నట్టు సమాచారం.


ఈ చిత్రంలో రానా మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో రానా సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారట. ఇక ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో రానా సరసన నటించిన కాజల్‌ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ నటించే అవకాశం ఉందట. ఆ ఇద్దరు కూడా టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అని చెబుతున్నారు. ప్రస్తుతం రానా హీరోగా నటించిన ‘అరణ్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ‘విరాట పర్వం’ షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు రానా గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ అనే ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడు.