వినాయర్ దర్శకత్వంలో ‘అల్లుడు శ్రీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఫస్ట్ సినిమాకే సమంత హీరోయిన్. తమన్నా ఐటెం సాంగ్‌తో పెద్ద హంగామాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే నమోదు చేసింది. ఆ తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలతో పలకరించాడు బెల్లంకొండ. అందులో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘జయ జానకి నాయక’ సినిమా మాత్రం పర్వాలేదనిపించింది. రీసెంట్‌గా రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘రాక్షసుడు’ కూడా బెల్లంకొండ శ్రీనివాస్‌కు మంచి పేరే తీసుకొచ్చింది. తాజాగా ఈ హీరో ఎన్టీఆర్‌తో రభస వంటి ఫ్లాప్ సినిమా తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘అల్లుడు అదుర్స్’ అనే టైటిల్ పెట్టారు. ఈ పేరు చూస్తుంటే.. అల్లుడు శ్రీను టైటిల్‌లా ఉంది. ఆ సినిమా సక్సెస్ అయినట్టే సెంటిమెంట్ కలిసొచ్చి ఈ సినిమా కూడా హిట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రానికి ‘అల్లుడు అదుర్స్’ అనే పేరు పెట్టినట్టు తెలుస్తోంది.
ఈ చిత్రంలో బెల్లంకొండ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ సరసన అను ఇమాన్యుయేల్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం బెల్లంకొండ 8 ప్యాక్‌తో కనిపించనున్నాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు.