కరోనా వైరస్‌‌ నుంచి తప్పించుకోవటం ఎలా .?

0
64

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఈ వైరస్ పేరు చెబితేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది మరణించగా మరి కొంతమంది మృతువుతో పోరాడుతున్నారు. ఇప్పటి వరకూ చైనా, కొన్ని దేశాలకు పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు భారత దేశానికీ కూడా చేరింది. ఢిల్లీ లో మొదట కరోనా వైరస్ కేసును కనుగొన్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు.
కరోనా విషయంలో తల్లి దండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇటీవలే కేరళలోని 3 సంవత్సరాల బాలుడికి కరోనా వైరస్ సోకిందని రక్తపరీక్షల్లో తేలింది. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మీ చేతులను ఎప్పుడు కూడా శుభ్రంగా కడుక్కోవాలి. చేతులను మీ ముక్కు, ముఖం నుండి దూరంగా ఉంచాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎవరికైనా అంటువ్యాధులు ఉన్నట్లు అనిపిస్తే వారికి మీరు దూరంగా ఉంచండి. ఏదేమైనా, పిల్లలు ప్రతిసారీ వారి ముఖాలను తాకకుండా ఉంచడం కష్టం. కొంతమంది పెద్దలు ఈ అలవాటును మానుకోవడం కష్టం. తల్లిదండ్రులు తమ పిల్లలు వారి ముఖాలను ఎన్నిసార్లు తాకినా, సంక్రమణ పట్టుకునే అవకాశాలను తగ్గించే ఐదు మార్గాల గురించి తెలుసుకోండి