మరింత పెరగనున్న విద్యుత్ ఛార్జీలు కారణం ఏంటి.?

0
65

విద్యుత్ ఛార్జీలు మరింత పెరగనున్నాయి. ఈ విషయంలో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచనున్నట్లు స్వయంగా సీఎం కేసీఆర్ వెల్లడించారు. విద్యుత్ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదని సీఎం స్పష్టంచేశారు. అయితే పేదలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ ఛార్జీలు పెంచుతామన్నారు. అసెంబ్లీలో పల్లెప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినా ప్రజలు వారిని నమ్మలేదన్నారు. విడతలవారీగా రుణమాఫీ చేస్తామని చెప్పిన మమ్మల్నే ప్రజలు నమ్మి గెలిపించారని వ్యాఖ్యానించారు.

అలాగే గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పన్నుల పెంపు అనివార్యమన్న సీఎం కేసీఆర్…పన్నులు చెల్లించే స్తోమత ఉన్నవారికే పన్ను పెంపు ఉంటుందన్నారు. రాష్ట్రం, నగరాలు, పట్టణాలు, గ్రామాల అభివృద్ధి కోసం పన్ను పెంపును ప్రజలు భరించాలని కోరారు. పంచాయితీలకు నిధుల కొరత లేకుండా చూస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.