కరోనా ప్రభావంతో నాని ‘వి’ మూవీ వాయిదా.

0
78

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న ‘వి’ సినిమా వాయిదా పడింది. ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తున్న మహమ్మారి కరోనా ప్రభావంతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. ఈ సందర్భంగా అఫీషియల్ ట్వీట్ చేశారు. ప్ర‌జా శ్రేయ‌స్సుని దృష్టిలో పెట్టుకొని ‘వి’ మూవీని వాయిదా వేస్తున్న‌ట్టు తెలిపింది చిత్ర యూనిట్. మార్చి 25న ఉగాది శుభాకాంక్ష‌ల‌తో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావించినప్పటికీ, కోవిడ్ 19 కార‌ణంగా మూవీని ఏప్రిల్‌కి వాయిదా వేశారు. ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ మీకు త‌ప్ప‌క వినోదం అందిస్తుంద‌ని మేము హామీ ఇస్తున్నాం అని చిత్ర బృందం పేర్కొంది.


డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. నాని, సుధీర్ బాబులకు జోడీగా అదితిరావు హైదరి, నివేదా థామస్ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి25న విడుదల చేయాలనుకున్నారు అయితే కరోనా ప్రభావంతో వాయిదా పడింది.