రైల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో రెండు బోగీలు తగలబడ్డాయి. మౌలాలి రైల్వే స్టేషన్‌లో శనివారం (మార్చి 14) మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో రైలు ఆగి ఉండటం, బోగీల్లో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఒక బోగి పూర్తిగా మంటల్లో కాలిపోగా.. మరో బోగీ పాక్షికంగా దగ్ధమైంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన ట్రెయిన్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్న ప్రత్యేక రైలని తెలుస్తోంది. అందువల్ల రైల్లో ప్రయాణికులెవరూ లేరని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -