తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం.

0
87

కరోనా వైరస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుందామన్నా… ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ విజృంభిస్తూ… దాని గురించే చర్చించుకునేలా చేస్తోంది ఈ మహమ్మారి. ఇప్పటివరకూ కరోనాతో 6515 మంది చనిపోయారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.69 లక్షలకు చేరింది. ఇటలీలో ఆదివారం ఒక్కరోజే 368 మంది చనిపోయారు. ఇరాన్‌లో 724 మంది, స్పెయిన్‌లో 292 మంది చనిపోయారు. మొత్తం 146 దేశాల్లో ఈ వైరస్ విస్తరించింది. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 110కి చేరింది. కరోనా మృతుడు సిద్ధికి కూతురికి కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. రికవరీ అయిన కేసుల సంఖ్య 12గా ఉంది. మృతుల సంఖ్య 2గా ఉంది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32కి చేరింది. కేరళలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఉత్తరాఖండ్‌లో కొత్త కేసు నమోదైంది.

తెలంగాణలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరికి వ్యాధి నయమవ్వడంతో… డిశ్చార్జి చేశారు. మిగతా ఇద్దరికీ ఐసోలేషన్ వార్డుల్లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియంలో 300 గదులు ఏర్పాటు చేసి… దాన్ని కరోనా ఏకాంత (క్వారంటైన్) కేంద్రంగా మార్చబోతోంది రెండ్రోజుల్లో. ఏపీలో 82 మందికి కరోనా వైద్య పరీక్షలు జరిపారు. వారిలో 65 మందికి నెగెటివ్ వచ్చింది. మరో 16 మంది రిపోర్టులకోసం చూస్తున్నారు. అలాగే 29 మందిని డాక్టర్లు కరోనా లక్షణాలున్న అనుమానితులుగా నిర్ణయించి, పర్యవేక్షిస్తున్నారు. ఐతే… ఏపీలో మాస్కుల కొరత ఉంది.