కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.

0
64

మధ్యప్రదేశ్ కమలనాథ్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఓవైపు బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశిస్తే… బల నిరూపణ జరగనివ్వకుండా స్పీకర్ ద్వారా ఎలా ఆపేస్తారనీ, దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు… కమలనాథ్ ప్రభుత్వాన్నీ, స్పీకర్‌ ప్రజాపతి, అసెంబ్లీ ప్రిన్సిపల్ సక్రెటరీ, గవర్నర్‌ని ఆదేశించింది. బుధవారం ఉదయం 10.30కి మళ్లీ విచారణ జరుపుతామని తెలిపింది. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ… మధ్యప్రదేశ్ బీజేపీ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్… సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు… ఆ పిటిషన్ న్యాయబద్ధమైనదిగా భావిస్తూ… ప్రభుత్వానికి నోటీస్ పంపింది. ఇప్పుడు కమలనాథ్ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇచ్చినా… సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటుతిరిగీ ఇటుతిరిగీ చివరకు స్పీకర్ అసెంబ్లీలో బలనిరూపణ అమలు చెయ్యక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.