కరోనా రాకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్ చిట్కాలు.

0
295

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మనదేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వ్యాప్తితో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రజల్లో భయం పోగొట్టి.. వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు సినీ, రాజకీయ నేతలు చొరవ తీసుకుంటున్నారు. ప్రధాని మోదీ సైతం పలు కీలక సూచనలు చెప్పారు. తాజాగా RRR స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా దేశ ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు.  ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..కరోనా వైరస్ మన దరి చేరకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. మరి అవేంటో ఈ వీడియోలో చూడండి.

1. చేతులను సబ్బుతో శుభ్రంగా మోచేతుల వరకు కడుక్కోవాలి. గోళ్ల సందుల్లో కూడా కడగాలి.

2. అవతలి వారికి హగ్, షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు. ముక్కు, కళ్లు, నోటిని చేతితో తాకరాదు.

3. పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉంటేనే మాస్క్ ధరించండి. తుమ్మినప్పుడు అరచేతిని కాకుండా మోచేతిని అడ్డుపెట్టుకోండి.

4. జనం ఎక్కువగా ఉంచే చోటికి వెళ్లకండి. మంచి నీళ్లు ఎక్కువ తాగండి. వేడి నీళ్లయితే ఇంకా మంచిది.

5. వాట్సప్‌లో వచ్చే ప్రతి సమాచారాన్ని దయచేసి నమ్మకండి. నిజానిజాలు తెలియకుండా కామెంట్ చేయకండి. అనవసరంగా ఇతరులను గందరగోళానికి గురిచేయవద్దు.

6. కోవిడ్19 మీద కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే సలహాలు సూచనలను ఖచ్చితంగా పాటించాలి. మనల్ని మనమే కాపాడుకుందాం.