నెల్లూరులో విషాదం. రైలు ఢీకొని లా స్టూడెంట్ మృతి.

0
54

కరోనా వైరస్ ఉంది కాలేజీకి వెళ్లొద్ద బాబూ అంటూ తల్లి కుమారుడికి చెప్పింది. ఈ ఒక్కరోజు వెళ్లొస్తానమ్మా.. రేపటి నుంచి వెళ్లను అంటూ ఆ యువకుడు ఇంటి నుంచి బయల్దేరి కాలేజీకి బయల్దేరి వెళ్లాడు. అమ్మకు వెళ్లొస్తానని చెప్పి బయటకు వచ్చిన కొద్దిసేపటికే అతడ్ని ట్రైయిన్ రూపంలో మృత్యువు వెంటాడింది. నెల్లూరులో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
సంగంలోని తూర్పు వీధికి చెందిన ఉపాధ్యాయుడు డి.నరసింహారెడ్డి, సునీతల కుమారుడు రామ్‌ ప్రతాప్‌రెడ్డి నెల్లూరు వీఆర్‌ లా కళాశాలలో లా సెకండియర్ చదువుతున్నాడు. కరోనా ఉందని కాలేజీకి వెళ్లొద్దని తల్లి ప్రతాప్‌కు చెప్పింది.. రేపటి నుంచి వెళ్లను ఈ ఒక్కరోజుకు వెళ్లొస్తానని చెప్పాడు. ఇంటి నుంచి బస్సులో నెల్లూరు చేరుకుని.. మినీ బైపాస్ రోడ్డులో దిగి నడుచుకుంటూ కాలేజీకి బయల్దేరాడు. విజయమహల్‌ గేటు సమీపంలో రైలు పట్టాలు దాటుతున్నాడు. హెడ్ సెట్ పెట్టుకుని అడుగులు వేశడు.

హెడ్ సెట్ చెవిలో ఉండటంతో.. ట్రైయిన్ రావడాన్ని గమనించలేదు.. ఇంతలోనే ప్రమాదం జరిగింది. వేగంతో వచ్చిన రైలు ఢీకొట్టింది. స్పాట్‌లోనే అతడు చనిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తండ్రికి సమాచారం ఇచ్చారు. కొడుకును విగతజీవిగా చూసిన ఆ తండ్రికి కన్నీళ్లు ఆగలేదు. చేతికి అంది వస్తాడనుకున్న కొడుకు ఇలా అర్ధాంతరంగా చనిపోవడం తీవ్రంగా కలిచివేసింది.. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.