స్టార్ హీరోయిన్‌గా ఆఫర్స్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్…

0
95

ఇండస్ట్రీలో నిజాలు తెలుసుకోవడం.. రియాలిటికి దగ్గరగా బతకడం చాలా తక్కువ మంది చేస్తుంటారు. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ముందుగా చెప్పుకోవాలి. ఈమెకు ఉన్న క్లారిటీ మరే హీరోయిన్‌కు లేదంటే అతిశయోక్తి కాదేమో..? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న లాజిక్ బాగా అర్థం చేసుకుంది రకుల్. ఇక్కడ ఏం చేస్తే అవకాశాలు వస్తాయనేది రకుల్‌కు బాగా తెలుసు.. అందుకే ఇన్నేళ్లైనా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా ఆఫర్స్ అందుకుంటుంది రకుల్. ఇదిలా ఉంటే తాజాగా ఈమె సౌత్ ఇండస్ట్రీపై చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఐదేళ్ల పాటు తెలుగులో టాప్ హీరోయిన్‌‌గా చక్రం తిప్పిన రకుల్.. ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్ చేసింది.

ఇక్కడ హీరోలందరిని చుట్టేయడంతో ప్రస్తుతం దక్షిణాదికి దూరమైంది రకుల్. ముంబైలోనే మకాం మార్చేసి అక్కడే సినిమాలు చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగానే దక్షిణాది ఇండస్ట్రీపై.. ఇక్కడి హీరోలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ ఆరంభంలో చాలా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయని బాధ పడింది రకుల్. అయితే తాను చేయాల్సిన సినిమాలు ఇతర హీరోయిన్లు చేసినా కూడా చాలా వరకు అవి ఫ్లాప్ అయ్యాయని చెప్పుకొచ్చింది ఈమె. ఇక హీరోయిన్స్ పారితోషికం గురించి కూడా నోరు విప్పింది రకుల్. ఈ విషయంలో మాత్రం చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించింది రకుల్. హీరో, హీరోయిన్ సేమ్.. వాళ్లు కష్టపడినట్లే మేం కూడా కష్టపడుతున్నాం.. సమానత్వం అనే మాటలు లేకుండా సింపుల్‌గా నిజాలు మాట్లాడింది రకుల్.

దక్షిణాది ఇండస్ట్రీలో హీరోయిన్ల కంటే హీరోలకు ఎక్కువగా ఇమేజ్ ఉంటుందని.. వాళ్లను చూడ్డానికి థియేటర్స్‌కు ప్రేక్షకులు వస్తారనే నిజాన్ని చెప్పింది రకుల్. అందుకే సౌత్‌లో హీరోలకు భారీ రెమ్యునరేషన్ ఉంటుందని చెప్పింది ఈమె. ఈ లాజిక్ తెలుసు కాబట్టే తను కూడా ఎప్పుడూ పారితోషికం కోసం బెట్టు చేయలేదని రకుల్ క్లారిటీ ఇచ్చింది. సౌత్‌లో హీరోలతో సమానంగా హీరోయిన్స్‌కు రెమ్యునరేషన్ ఇవ్వాలని తానెప్పుడూ డిమాండ్ చేయలేదని.. చేయనని కూడా చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ మాత్రం క్లారిటీ ఉంటే చాలు స్టార్ హీరోయిన్ అయిపోవడానికి.. పాపం ఈ తెలివి తేటలు లేక చాలా మంది ముద్దుగుమ్మలు స్టార్స్ కాలేకపోతున్నారు.