రెండో సారి పెళ్లి పీటలు ఎక్కిన అమలపాల్ .

0
50

ఒకప్పుడు తెలుగులో వరస సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా దూరమైపోయింది అమలా పాల్. కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే పాతికేళ్లు కూడా నిండకుండా దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ముచ్చటగా మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే వీళ్లు వివాహ బంధం విచ్చిన్నం అయిపోయింది. విడిపోయిన తర్వాత సినిమాలతో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. ఇప్పటికే విజయ్ రెండో పెళ్లి చేసుకుని హాయిగా సెటిల్ అయిపోయాడు. ఇక ఇప్పుడు అమలా పాల్ కూడా రెండో పెళ్లి చేసుకుంది. ఎవరికీ చెప్పకుండా చాలా సైలెంట్‌గా తను ప్రేమించిన అబ్బాయితో మూడు ముళ్లు వేయించుకుంది.
అమలా పాల్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే విడాకులు తీసుకున్న తర్వాత అమలా పాల్ క్రేజ్ ఇంకా పెరిగింది. ఈమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు. గతేడాది ఆడై సినిమాలో ఏకంగా న్యూడ్ సీన్స్ కూడా చేసింది. ఇక ఇప్పుడు హీరోయిన్‌గా మళ్లీ బిజీ అవుతున్న తరుణంలో రెండో పెళ్లి చేసుకుంది ఈ భామ. నేను పెళ్లి చేసుకుంటానని ఆ మధ్య చెప్పిన ఈమె.. ఇప్పుడు అన్నంత పని చేసింది.
తన మొగుడితో కలిసి లిప్ లాక్ సీన్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది అమలా పాల్. విజయ్ ప్రేమ నుంచి బయటికి వచ్చిన తర్వాత రెండోసారి ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంది అమలా పాల్. ఆయన పేరు భవీందర్ సింగ్. ముంబై బేస్డ్ సింగర్.. అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలా పాల్. వరుడి ఫోటోలు ఇన్ని రోజులు బయటపెట్టకపోయినా పెళ్లి తర్వాత మాత్రం తన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేసింది అమలా. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అన్నట్లు సినిమాలు కూడా వరసగా చేస్తూనే ఉంటానని చెప్పింది ఈమె.