కరోనా ఎఫెక్ట్ : రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆర్టీసీ సర్వీసులను రద్దు.

0
99

జనతా కర్ఫ్యూ సందర్భంగా రేపు ఏపీలో బస్సు సర్వీసులు రద్దు కానున్నాయి. ఏపీలో దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆర్టీసీ సర్వీసులను రద్దు చేయనున్నారు. మొత్తం 11 వేల బస్సు సర్వీసులను నిలిపేయనున్నట్టు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. కరోస్ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జనతా కర్ఫ్యూ నిర్ణయానికి మద్దతుగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రైలు సర్వీసులు రద్దయ్యాయి. రేపు పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. వైరస్ అడ్డుకట్ట విషయంలో ప్రజారవాణాను నియంత్రించడం కూడా కీలకం కావడంతో… ఏపీలో జనతా కర్ఫ్యూ సందర్భంగా బస్సు సర్వీసులను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.