టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌పై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ సమయంలో తన గెస్ట్ హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రభాస్ యత్నించాడని రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబర్‌లో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. జీవో నెంబర్ 59 కింద దీన్ని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ గతంలోనే శేరిలింగంపల్లి తహసీల్దార్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కూకట్ పల్లి కోర్టులో ట్రయల్ జరగనుంది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -