కరోనా వైరస్ సామాన్య ప్రజలనే కాదు… ప్రజా ప్రతినిధులను కూడా కబళిస్తోంది. తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే జే అన్బళగన్ (61) కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ని మంగళవారం ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ట్రీట్‌మెంట్ పొందుతూ ఆయన కన్నుమూశారు. ఇండియాలో కరోనా వైరస్ సోకి మరణించిన తొలి ప్రజా ప్రతినిధి ఆయనే అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
ఇటీవల తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు బాగా పెరిగాయి. ఇలా కరోనా విజృంభిస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లకు కూడా కరోనా సోకుతోంది. అన్బళగన్ పరిస్థితి విషమిస్తున్నట్లు కనిపించడంతో… మంగళవారం… పార్టీ జిల్లా సెక్రెటరీలు, ఓ సీనియర్ నేతా కలిసి… ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో… ఆయన సరిగా ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశారు.