అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పునాది.

0
78

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పునాది రాయిపడింది. రాజజన్మభూమి ప్రాంతంలోని కుబేర్ తిలలో భూమి పూజ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ అధికార ప్రతినిధి మహంత్ కమల్ నయన్ దాస్ పాల్గొన్నారు. మొదట పరమ శివుడికి రుద్రాభిషేకం నిర్వహించి.. అనంతరం పునాది రాయిని నెలకొల్పారు. మహంత్ కమల్ నయన్ దాస్ ఇతర సాధువులతో రుద్రాభిషేక క్రతువును ఉదయం 8:00 గంటలకు ప్రారంభించారు. ఈ ఆరాధన 2 గంటల పాటు జరిగింది. ఆ తర్వాత ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు.

లంకపై యుద్ధానికి వెళ్లే ముందు రాముడు రుద్రాభిషేకంతో శివుణ్ని ప్రార్థించినట్టుగానే.. రామమందిర నిర్మాణాన్ని కూడా ప్రారంభించినట్టు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర సభ్యులు తెలిపారు. రాముడు తొలిపూజ నిర్వహించిన సంప్రదాయాన్ని తామూ అనుసరిస్తున్నామని వెల్లడించారు.