అల్లు అర్జున్ ఇప్పుడు సినిమాలతో కాకుండా కుటుంబంతో బిజీగా ఉన్నాడు. పైగా ఇప్పుడు లాక్డౌన్ కావడంతో వాళ్ళతోనే పూర్తి టైమ్ గడిపేస్తున్నాడు బన్నీ. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ హీరో. లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందు ఈ చిత్రం మొదలైంది. ప్రస్తుతం ఈయన ఇంట్లో పిల్లలతో ఆడుకుంటున్నాడు. హాయిగా వాళ్లతోనే టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా బన్నీ తన కూతురుపై ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కూతురుతో ఎం చక్కా అన్నీ మరిచిపోయి ఆనందంగా ఉన్నాడు బన్నీ.
తాను చెప్పినట్లుగా కూతురుతో అనిపిస్తున్నాడు బన్నీ. నేను నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని కూతురుతో అనిపిస్తున్నాడు బన్నీ. నేను నాన్న చెప్పిన అబ్బాయిని వరకు అన్న ఆ చిన్నారి.. చేసుకోనంటూ ముద్దుగా పలుకుతుంది. ఇదివరకు ఓసారి ఇలాంటి వీడియో చేసారు. ఇప్పుడు మరోసారి అదే వీడియో చేసారు ఈ ఇద్దరూ. చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ వీడియో చూసి తెగ షేర్లు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ తన ఇన్‌స్టాలో ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. మొత్తానికి బన్నీ మాదిరే కూతురు కూడా దేశముదురే అన్నమాట.