జూన్ 15 నుంచి జూలై 31 వరకు ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు.

0
52

దేశ రాజధానిలో కరోనా విలయ తాండవం చేస్తోంది. భారీ మొత్తంలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం #ReLockDelhi ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. అంతేకాదు జూన్ 15 నుంచి జూలై 31 వరకు ఢిల్లీలో లాక్‌డౌన్ విధిస్తారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లాక్‌డౌన్ పొడిగింపుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. లాక్‌డౌన్‌ను పొడిగించబోమని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పష్టం చేశారు.

కాగా, ఢిల్లీలో కరోనా తీవ్రతపై సుమోటాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు .. కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించింది. దేశ రాజధానిలోని ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లను పశవుల కంటే హీనంగా చూస్తున్నారని.. మృతదేహాలు చెత్త కుప్పల్లో కనిపిస్తున్నాయని మండిపడింది. మృతదేహాల నిర్వహణ సరిగ్గా లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌల్‌ వాపోయారు. ఢిల్లీలో పరిస్థితితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వచ్చిన ప్రారంభంలో కరోనా పరీక్షల చేయడంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నదని.. కానీ ఆ తర్వాత క్రమంగా టెస్ట్‌ల సంఖ్య తగ్గిందని సుప్రీంకోర్టు వెల్లడించింది.

గతంలో 7వేలకు పైగా టెస్ట్‌లు చేసే వారని.. కానీ ఇప్పుడు 5వేలు కూడా దాటటం లేదని నిలదీసింది. అంతేకాదు కరోనా వైరస్‌తో రోగులు చనిపోతే వారి కుటుంబ సభ్యలకు కూడా సమాచారం ఇవ్వడం లేదని మీడియాలో కథనాలు వస్తున్నాని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కథనాలు చూస్తే దేశంలో పరిస్థితుల ఎంత దిగజారోయో అర్థం చేసుకోవచ్చని అత్యున్నత ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీ వైద్యఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. ఢిల్లీలో ఇప్పటి వరకు 34687 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారి నుంచి 12731 మంది కోలుకోగా.. మొత్తం 1085 మంది చనిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో 20,871 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత ఢిల్లీ మూడో స్థానంలో ఉంది.