గుంటూరు ఆసుపత్రిలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చికిత్స.

0
115

టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు జరిపి విశ్రాంతి అవసరమని భావించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. 3:10 గంటలకు ఏసీబీ ప్రధాన న్యాయమూర్తి వద్ద అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు హాజరుపరిచారు. ప్రధాన న్యాయమూర్తి కూడా అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి విచారించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అదేశించారు. ఏసీబీ సబ్ జైల్ లో హాజరు పరిచిన అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రత ని కట్టుదిట్టం చేశారు.

అచ్చెన్నాయుడుకు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు అక్కడకు భారీగా చేరుకుంటున్నాయి. గుంటూరులో అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు చంద్రబాబుకు జైళ్ల శాఖ అధికారులు నిరాకరించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమన్న జైళ్ల శాఖ తేల్చిచెప్పింది. ఇందుకోసం గత 2 నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని జైళ్లశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే చంద్రబాబు చేసుకున్న వినతిపై జిజిహెచ్ హాస్పటల్ సూపరింటెండెంట్ స్పందించారు. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని సూపరింటెండెంట్ సూచించారు.