తిరుపతి రైలులో అలా జరగడం ఆచర్యం.

0
74

మన భారతీయ రైళ్లు ఖాళీగా వెళ్లే సందర్భాలు చాలా చాలా తక్కువ. ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. ముఖ్యంగా ఏసీ కోచ్‌లు రెండు మూడు నెలలు ముందుగానే రిజర్వ్ అయిపోతుంటాయి. అలాంటిది కరోనా వచ్చిన తర్వాత పరిస్థితి చాలా మారింది. రైళ్లు ఎక్కడాన్ని ఓ సవాలుగా, ఓ సాహసంగా ఫీలవుతున్నారు ప్రయాణికులు. ఏసీ బోగీల్లో టికెట్లు కొనుక్కోవడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. ఫలితంగా చాలా రైళ్లలో ఏసీ బోగీలు ఎక్కువగా ఫిలప్ కావట్లేదు. తాజాగా తిరుపతి రైల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఏసీ బోగీలో ఒక్కరూ లేరు. ఖాళీగా ఉంది.

నిజానికి తిరుపతి వెళ్లే ఏ రైలైనా ఇదివరకూ రోజూ రద్దీగా ఉండేది. ఒకటి, రెండు నెలల ముందే బుక్‌ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జూన్‌ 1న ప్రారంభించిన తిరుపతి-నిజామాబాద్‌ (రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌) ప్రత్యేక రైలులో సగం బెర్తులు కూడా నిండట్లేదు. శనివారం సాయంత్రం తిరుపతి నుంచి నిజామాబాద్‌ బయలుదేరిన రైలులో 8 ఏసీ బోగీలు ఉన్నాయి. వాటిలో 40 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. అంటే యావరేజ్‌గా ఒక్కో బోగీలో… ఐదుగురు మాత్రమే ఉన్నట్లు అనుకోవచ్చు. ఇక సికింద్రాబాద్‌ వచ్చేసరికి ఏడుగురే మిగిలారు. నిజామాబాద్‌ వరకూ వెళ్లే వారు మాత్రమే ఏసీ బోగీల్లో ప్రయాణించారు. ఈ లెక్కన చూస్తే… 8 ఏసీ బోగీల్లో ఏడుగురు మాత్రమే ప్రయాణించినట్లు.

ఈ పరిస్థితి రావడంపై అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ప్రజల్లో ఇంత మార్పు వస్తుందని ఊహించలేదన్నారు. ఇక్కడ ప్రజల నుంచి రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి ప్రజల్లో కరోనాపై ఎంతో కొంత భయం ఉంది. అది వారిని ప్రయాణాలకు దూరం ఉంచుతోంది. మరో కోణంలో ప్రజల్లో జాగ్రత్త ఎక్కువైంది. కరోనా విషయంలో వారు రాజీ పడట్లేదు. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అది ఎలా సోకుతోందో తెలుసుకుంటూ… దాన్ని దరిచేరనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అందువల్లే ప్రయాణాలు తగ్గిపోయాయనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా రైళ్లలో రద్దీ తగ్గిపోవడం అనేది ఎవరూ ఊహించని పరిణామంగా మారింది.