ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసాడు. అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పరుశురామ్ ఈ సినిమాను తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీ చేస్తాడనకుంటే.. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో బ్యాంక్ మోసాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.ఈ సినిమాలో మహేష్ బాబుకు ఢీ కొట్టే విలన్ పాత్ర కోసం సుదీప్‌తో పాటు ఉపేంద్ర పేర్లు పరిశీలిస్తున్నారు. ఫైనల్‌గా వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు చేయడం మాత్రం ఖాయం అంటున్నారు.

అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముందుగా కియారా అద్వానీ అనుకున్నారు. ప్రస్తుతం కియారా వరస కమిట్‌మెంట్స్ కారణంగా ఈ సినిమాలో చేయలేకపోతున్నట్టు మహేష్ బాబుకు చెప్పినట్టు సమాచారం. అందుకే ఈ సినిమాలో కథానాయికగా మహానటితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ను తీసుకున్నట్టు సమాచారం.
ఇప్పటికే కీర్తి సురేష్ ఈ కథ నచ్చి ఓకే చెప్పిందట. డిసెంబర్ నుంచి ‘సర్కారు వారి పాట’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అప్పటికే కీర్తి సురేష్ తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో ఈ సినిమాకు బల్క్ డేట్లు కేటాయించనుంది. త్వరలోనే కీర్తి సురేష్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.