- నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలు
- భారీ సంఖ్యలో హాజరైన మహిళలు
- బతుకమ్మ పాటలతో హోరెత్తిన
- నవ్య ల్యాండ్ మార్క్
- అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక వర్గం అమీన్పూర్ మున్సిపాలిటి పరిధిలోని నవ్య కాలనీలో వసుధ టివీ అధ్వర్యంలో బతుకమ్మ పోటీలు, సంబరాలు, నిర్వహించారు.
నవ్య కాలనీలోని అరు బ్లాక్ ల్లోని మహిళలు పోటీలో పాల్గొన్నారు .స్వయంగా బతుకమ్మను తయారు చేసి తమ ఆట,పాటలతో మహిళలు, పిల్లలు బతుకమ్మ గొప్పతనాన్ని చాటుతూ పాటలు పాడారు.

ఉత్తమ బతుకమ్మగా ప్రథమ బహమతి రూ.5 వేలు
ద్వితీయ బహమతి రూ.4 వేలు తృతీయ బహమతి రూ.3వేలు
వసుధ టివీ ఎండీ వంశీ ప్రియా రెడ్డి
విజేతలకు అందించారు
అలాగే డాన్స్ లు, పాల్గొన్న ప్రతి మహిళకి అందమైన బహుమతులు అందజేశారు. అలాగే కార్యక్రమానికి సహకరించిన అమీన్పూర్ టీ ఆర్ ఎస్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పి.విజయ వెంకట్ గౌడ్ గారికి వసుధ ఛానల్ ఎండీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు







