చైనాకు చెందిన మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్ ఫోన్ ఎంఐ 9ను గురువారం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 11.30 గంటలకు చైనాలో ఓ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనుంది.
Mi 9 specifications
ఈ ఫోనులోని ఫీచర్లను పరిశీలిస్తే, ఈ ఫోన్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 48, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఆండ్రాయిడ్ 9.0 వంటివి ఉన్నాయి.
అలాగే, 3500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇక ఈ ఫోన్ ధర రూ.34,700 గా ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ గురించిన మిగిలిన వివరాలు అత్యంత గోప్యంగా ఉంచారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.