సీఎం చంద్రబాబు కొండవీడు పర్యటన సందర్భంగా రైతు కోటయ్య మరణించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటన పై టీడీపీ, వైసీపీ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం హెలికాప్టర్ దిగేందుకు రైతు కోటయ్య పంటను ధ్వంసం చేశారని..పోలీసుల దౌర్జన్యం వల్లే రైతు చనిపోయాడని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఐతే వైసీపీ విమర్శలపై ఏపీ మంత్రి లోకేశ్ స్పందించారు. వ్యక్తిగత కారణాలతో కోటయ్య చనిపోయాడని తెలియజేసారు. “శవాన్ని అడ్డుపెట్టుకొని కుల రాజకీయం చెయ్యాలని 420 ఆరాటపడుతునారు” తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వైసీపీ పై మందిపడ్డారు.
కొండవీడు రోడ్డు ప్రారంభానికి ఇంత హంగామా ఎందుకు చంద్రబాబు? అమరావతికి 50 కిమీ దూరంలో ఉన్న గ్రామానికి హెలికాప్టర్ లో వెళ్లాలా? హెలిపాడ్ కోసం చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా అడ్డుకుంటారా? పేదల ప్రాణాలకు కనీస విలువ లేకుండా పోయింది మీ పాలనలో….
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 20, 2019
ఇప్పుడు మరోసారి దొంగ పత్రిక, దొంగ రాతలతో శవాన్ని అడ్డుపెట్టుకొని కుల రాజకీయం చెయ్యాలని 420 ఆరాటపడుతున్నారు. కొండవీడులో రైతు కోటయ్యగారు వ్యక్తిగత కారణాలతో చనిపోతే సానుభూతి ప్రకటించాల్సింది పోయి మీ నీచ రాజకీయం కోసం వాడుకోవడమే వైకాపా ఎజెండానా?
— Lokesh Nara (@naralokesh) February 19, 2019