ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి హెలీకాప్టర్‌లో వెళ్లేందుకు ప్రయత్నించడం వల్లే ఓ రైతు చనిపోయాడని వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. పేదల ప్రాణాలంటే వారికి విలువ లేదని విమర్శించారు.
పనిలో పనిగా చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో చనిపోయిన రైతు కోటయ్య వ్యవహారాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందని నారా లోకేష్ ట్విట్టర్లో విమర్శించారు. వైకాపాను ఉద్దేశించి ఆ పార్టీ శవాలపై పేలాలు ఏరుకునేలా రాజకీయాలు చేస్తోందని నారా లోకేష్ మండిపడ్డారు. ఇలాంటి వాటికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… లోకేశ్‌కు కౌంటర్ ఇచ్చారు. తాము శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని నారా లోకేష్ అన్నారు. అయినా ఇంతకీ ఆ శవం ఎవరని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఆ శవం నువ్వా? మీ నాన్న చంద్రబాబా అని సెటైర్లు వేశారు.
లోకేష్…
మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని ట్వీట్ పెట్టావ్. ఇంతకీ శవం ఎవరు.
నువ్వా? మీ నాన్నా?— Vijayasai Reddy V (@VSReddy_MP) February 20, 2019