గోధుమ లడ్డూను ఎలా తయారు చేస్తారు?

0
75

గోధుమ పిండి అరకేజీ
నెయ్యి 150 గ్రాములు,
యాలకుల పొడి అర టీ స్పూను,
బెల్లం 350 గ్రాములు
కిస్‌మిస్ 2 టేబుల్ స్పూన్లు,
జీడిపప్పు 50 గ్రాములు

తయారు చేసే విధానం
ఓ కడాయిలో నెయ్యి వేసి గోధుమపిండి వేసి దోరగా వేయించాలి. మంచి వాసన వస్తుండగా దించి చల్లార
నివ్వాలి. అదే కడాయిలో మరికొంచెం నెయ్యి వేసి జీడి పప్పు, కిస్ మిస్ వేయించి తీయాలి. బెల్లం సన్నగా తురమాలి ఈ తురుమును దోరగా వేయించిన గోధుమ పిండిలో కలపాలి. అందులోనే యాలకుల పొడి, జీడి పప్పు, కిస్ మిస్, వేసి బాగా కలపి లడ్డూల్లా చుట్టి చల్లార నివ్వాలి. ఆ తర్వాత ఆరగిస్తే ఎంతో టేస్టీగా ఉంటాయి.