చింతమనేని వివాదం…వైసీపీ vs టీడీపీ

0
55

“మీరు దళితులు, మీరు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, మీరు వెనుకబడిన తరగతులు వాళ్ళు. రాజకీయాలు మాకు ఉంటాయి, మాకు పదవులు! మీకెందుకు రా పదవులు పిచ్చముండా కొడకల్లారా” అంటూ చింతమనేని ప్రభాకర్ మాట్లాడిన మాటలు రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఈ వివాదం పై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
“చంద్రబాబు వదిలిన గూండా చింతమనేని దళితులను అనాగరికంగా ధూషిస్తున్నవీడియో చూస్తే వొళ్లు జలదరిస్తోంది. టీడీపీ నేతల తలపొగరు పతాక స్థాయికి చేరింది. దళితులకు రాజకీయాలెందుకు అనేవారు ఓట్లు కూడా అడగొద్దు. అయినా ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? చింతమనేని మీద కేసు పెట్టలేదు, అరెస్టు చేయలేదు, పార్టీ నుంచి బహిష్కరించలేదు. చింతమనేనిని చంద్రబాబుని దళితులు “మీకెందుకురా రాజకీయాలు, పిచ్చ….” అనే రోజు త్వరలోనే వస్తుంది.” అంటూ వైసీపీ ప్రముఖ నేత విజయ్ సాయి రెడ్డి ప్రశ్నించారు.

దీనికి కౌంటర్ గా నారా లోకేష్ స్పందిస్తూ “నిజం – చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపించదు? వీడియోలో చింతమనేని మాటలకు వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారు. తమను అవమానిస్తుంటే ఎవరైనా చప్పట్లు, కేరింతలు కొడతారా జగన్ గారు?” అంటూ ప్రశ్నించారు.