పుల్వామా దాడిని ఖండించాలి… భారత్‌కు ఆ హక్కుంది: షోయబ్ అక్తర్

0
72

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిFormer Pakistani cricketerని ప్రతి ఒక్కరూ ఖండించాలని, అదేసమయంలో పాకిస్థాన్ ప్రధాని వ్యాఖ్యలకు కూడా మరో ఆలోచన లేకుండా కట్టుబడివుండాలని ఆదేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డారు.

పుల్వామా దాడికి ఎఫెక్ట్ వచ్చే క్రికెట్ ప్రపంచ కప్‌పై పడింది. ఈ మెగా టోర్నీలో పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడరాదని అనేకమంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, ఈ దాడిపై గుర్రుగా ఉన్న బీసీసీఐ కూడా కఠిన వైఖరినే అవలంభిస్తోంది ఇందులోభాగంగా, పాకిస్థాన్‌ను ఏకంగా క్రికెట్ ప్రపంచ కప్ నుంచే బహిష్కరించేలా ఐసీసీపై ఒత్తిడి చేయనుంది.

ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడిపై అక్తర్ స్పందిస్తూ, ‘భారత్‌పై ఉగ్రదాడి జరిగింది. ఆ విషయంలో మీరు వాదనలకు దిగాల్సిన పనిలేదు. బోల్డంతమంది ప్రాణాలు కోల్పోయారు. మనం గట్టిగా ఖండించాలి. అయితే, మనం మన ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యలకు రెండో ఆలోచన లేకుండా కట్టుబడి ఉండాలి’ అని వ్యాఖ్యానించాడు. పాక్‌తో ఆడకూడదనుకునే హక్కు భారత్‌కు ఉందని అక్తర్ తేల్చి చెప్పాడు.