భారత్ బౌన్సర్లకు పాక్ బెంబేలు : ఆ రెండు ఉగ్ర సంస్థలపై నిషేధం

0
45

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ను అన్ని విధాలుగా ఏకాకిని చేసేలా భారత్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులోభాగంగా తొలుత మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ (అత్యంత అభిమాననీయ దేశాలు) జాబితా నుంచి పాకిస్థాన్ పేరును తొలగించింది. ఆ తర్వాత పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న అనే రకాల వస్తు ఉత్పత్తులపై కస్టమ్స్ పన్నును ఏకంగా 200 శాతానికి పెంచింది. తద్వారా భారతీయ వ్యాపారులు పాక్ వస్తువుల జోలికి వెళ్లకుండా చేసింది.

ఇపుడు సట్లెజ్, బియాస్ నదుల నుంచి పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న అదనపు జలాలను నిలిపేసింది. భారత దేశానికి హక్కుగా లభించే జలాల్లో కొంత వరకు పాకిస్థాన్‌కు వెళ్తున్నాయి. ఈ జలాలను జమ్మూ-కాశ్మీరు, పంజాబ్‌లకు మళ్ళించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

ఈ ప్రకటన వెలువడిన కొన్ని నిమిషాల్లోనే పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా (జేయూడీ), ఫలాహ్ – ఈ – ఇన్సానియత్ (ఎఫ్ఐఎఫ్)లపై నిషేధాన్ని పునరుద్ధరించింది.


పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. వాణిజ్యపరమైన చర్యలతోపాటు రావి, సట్లెజ్, బియాస్ నదుల నుంచి పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న అదనపు జలాలను నిలిపేసింది. భారత దేశానికి హక్కుగా లభించే జలాల్లో కొంత వరకు పాకిస్థాన్‌కు వెళ్తున్నాయి. ఈ జలాలను జమ్మూ-కశ్మీరు, పంజాబ్‌లకు మళ్ళించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గడ్కరీ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే పాకిస్థాన్ మీడియా ఓ వార్తను ప్రచురించింది.

ఈ మేరకు పాక్ జాతీయ మీడియాలో ఓ వార్త ప్రసారమైంది. పాకిస్థాన్ జాతీయ భద్రతా కమిటీ గురువారం సమావేశమైందని, ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ముమ్మరం చేసిందని తెలిపింది. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగినట్లు పేర్కొంది. పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో భౌగోళిక వ్యూహాత్మక, జాతీయ భద్రత పరిస్థితులపై చర్చించినట్లు వెల్లడించింది.

అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా (జేయూడీ), ఫలాహ్-ఈ-ఇన్సానియత్ (ఎఫ్ఐఎఫ్) లపై నిషేధాన్ని పునరుద్ధరించాలని ఈ సమావేశం నిర్ణయించినట్లు తెలిపింది. అయితే, ఈ తరహా నిర్ణయాలపై పెద్దగా ప్రయోజనం లేదు. ఎందుకంటే.. పాకిస్థాన్ గడ్డపై హఫీజ్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.