పుల్వామా దాడి: ఐపీఎల్ ఆరంభ సంబరాలు అవసరం లేదు

0
40

ఐపీఎల్ ఆరంభ సంబరాలను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ సీజన్ తొలిరోజు.. బాణసంచాతోపాటు టాలీవుడ్ నటీనటులు, గాయకులతో అంబరాన్నంటే సంబరాలు నిర్వహిస్తుంటారు. మార్చి 23న ఐపీఎల్ 12వ సీజన్ ప్రారంభం కానుంది.

కానీ ఈ ఏడాది ఆరంభ వేడుకలను బీసీసీఐ క్రికెట్ పాలకుల కమిటీ రద్దు చేసింది. ఇందుకు పుల్వామా ఘటన కారణం. ఐపీఎల్ ఆరంభ వేడుకకు కేటాయించిన మొత్తాన్ని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవానుల కుటుంబాలకు అందజేస్తామని పాలకుల కమిటీ అధినేత వినోద్ రాయ్ తెలిపారు.

అమర జవానుల గౌరవార్థం వేడుకలను రద్దు చేసినట్టు కూడా ఆయన తెలిపారు. టోర్నీకి సంబంధించిన రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రమే నిర్వాహకులు విడుదల చేశారు. దానిలో 17 మ్యాచ్‌ల వివరాలను పొందుపరిచారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత పూర్తి మ్యాచ్‌ల జాబితాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.