మినరల్ వాటర్ మంచిదా ? జనరల్ వాటర్ మంచిదా?

0
197
Pouring water from bottle into glass high quality and high resolution studio shoot

ఈ మధ్య కాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్ ని కొని అవే మంచివని.. లీటర్ 4 రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం. కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ము తున్నారు. వాటిలో స్వచ్చత ఉందా ? లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది.
కానీ ఈ మధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే…

నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ము తున్నారు. దీని వలన ప్రమాదమే…కానీ ఉపయోగం లేదు. రోగాలని కావాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు.

ఇంకో విషయం ఏంటంటే.. బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగి పోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీని వలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగి పోతున్నాయి.

భారత దేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు.
నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటి లో ఉండే సూక్ష్మ క్రిములు చని పోతాయి.

ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో ”రోబ్ రీడ్” అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు,
మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచన కారి అయిన ఒక సూక్ష్మ క్రిమిని వేశారు.

దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా..రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించి పోయాయి.

కానీ ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కనుగొన్నారు. ఈ మధ్య కాలం లో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం.
ఎందు కంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా. కాబట్టి..

వానా కాలం 4 నెలలు – రాగి పాత్రలో,
చలి కాలం 4 నెలలు – ఇతడి పాత్రలో,
ఎండా కాలం 4 నెలలు – మట్టి పాత్రలో (కుండ) నీళ్లు త్రాగడం శ్రేయస్కరం.

 

 

 

కనుక రాగి, ఇత్తడి, మట్టి పాత్రలను వాడండి. అల్యూమినియం, ప్లాస్టిక్ వదిలేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
నిజానికి దేశం యొక్క పరిస్థితి చెడుగా లేదు మన అలవాట్లు చెడు గా ఉన్నాయి.