ప్రముఖ హాస్యనటుడు అలీపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు గుప్పించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం నిర్వహించిన అలీ సన్మాన సభకు చంద్రబాబు హాజరయ్యారు. అలీ దంపతులను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. అలీ రాజకీయాల్లోకి రావాలని.. కొత్త ఒరవడిని సృష్టించాలన్నారు. 40 ఏళ్ల సినీ జీవితంలో అలీ కూడా ఎంతో కష్టపడ్డారని, ఓ మంచి వ్యక్తిని అభినందించాలనే ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమంలో భాగస్వామినయ్యానని చెప్పారు. జీవితంలో రిలాక్షేషన్ రావాలంటే అలీ లాంటి వ్యక్తులు ఉండాల్సిందేనన్నారు. ఎన్టీఆర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లోకి వచ్చారని, ఆ తర్వాత తన జీవితాన్ని ప్రజలు అంకితం చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారికి గుర్తింపు వచ్చిందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఒక్క ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -