సగ్గుబయ్యం ఒక కప్పు,
పచ్చిమిర్చి రెండు,
నీళ్లు ఆరు కప్పులు,
జీలకర్ర పొడి అరటీస్పూను,
ఉప్పు తగినంత,
తయారు చేసే విధానం:
ముందుగా ఓ పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసి బాగా ఉడికించాలి. నీళ్లు చిక్కగావచ్చాక అందులో జీలకర్రపొడి, ఉప్పు, కచ్చపచ్చగా చేసి ఉంచిన పచ్చిమిర్చి, వేసి బాగా కలపి చల్లారనివ్వాలి. ఇప్పుడు కాటన్ క్లాత్ మీద కాని లేదా పాలితిన్ పేపర్ మీద కాని వడియాలు చిన్న గరిటెతో పెట్టుకోవాలి. రెండు లేక మూడు రోజులు బాగా ఎండబెట్టాలి. గాలి తగలని డబ్బాలో నిల్వ చేసి ఉంచాలి. ఆ తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో వేయించుకోవాలి. ఇకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ ప్రయత్నం చేసి చూడండి.