రక్తపోటుకు చెక్ పెట్టే ఆహారం ఏది ?

0
80

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ రక్తపోటు (బీపీ) బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురులో ఒకరు బీపీతో బాధపడుతున్నట్టు పలు పరిశోధనలు చెబుతున్నాయి. అలాంటి బీపీని అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని రకాల వ్యాయామాలతో పాటు.. తగిన ఆహారం తీసుకుంటూ, ఎలాంటి ఆదోళన, ఒత్తిడి లేకుండా జీవనం సాగించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అందుకే బీపీ అదుపులో ఉంచే పండు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను పరిశీలిస్తే…

* ప్రతి రోజూ క్రమం తప్పకుండా మీగడ తీసిన పాలనేతాగాలి. టీ, కాఫీలకు దూరంగా ఉంటే మంచిది. మీగడ తీసిన పాలలో ఉండే కాల్షియం, విటమిన్‌-డి ఎముకల ధృడత్వానికి ఉపయోగపడతాయి.
* బీపీతో పాటు గుండెకు సంబంధించిన సమస్యలకు దూరంగా ఉండాలంటే స్కిమ్డ్‌ మిల్క్‌ తాగితే మంచిది.
* ప్రతి రోజూ మూడు పూటల అరటి పండును ఆరగించాలి. ఎందుకంటే వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పైగా, హైబీపీ రాకుండా సాధారణ రక్తప్రసరణ జరగటానికి దోహదపడతాయి.
* వేసవి కాలంలో లభించే పుచ్చకాయలో పొటాషియం, పైబర్‌, విటమిన్‌-ఎలు పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఆరగించడం వల్ల బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.
* నారింజ పండ్లలో విటమిన్‌-సి, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఈ పండ్లను ఆరగించినా, జ్యూస్ రూపంలో తీసుకున్నా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
* పొద్దుతిరుగుడు విత్తనాలు తినటం వల్ల బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి. వీటిలో ఫోలిక్‌ ఆసిడ్‌, ప్రొటీన్‌, ఫైబర్‌, విటమిన్‌-ఇ పుష్కలంగా ఉంటాయి.
* అన్నిటికంటే ముఖ్యంగా, ఫోలిక్‌ ఆసిడ్‌, ప్రొటీన్‌, ఫైబర్‌, విటమిన్‌-ఇ పుష్కలంగా ఉండే పాలకూరని బీపీ ఉండేవారు తమ ఆహారంలో ప్రతి రోజూ చేర్చుకుంటే ఎంతో మంచిది. ఇందులో తక్కువ క్యాలరీస్‌, ఎక్కువ ఫైబర్‌ ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. గుండె రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.