ఎముకలు దృఢంగా ఉంటాలంటే…

0
105

ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. కండరాలు, నరాలవ్యవస్థ సరిగా ఉండాలన్నా కాల్షియం ఎంతో ముఖ్యం. అందుకే ప్రతిరోజూ మనం తీసుకునే డైట్‌లో కాల్షియం లభించేలా చూసుకోవాలి. పాలు ఒక గ్లాసు.. పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ ఓ గ్లాసు పాలు తీసుకుంటే 300 మిల్లీగ్రామాల తీసుకుంటే కాల్షియం లభిస్తుంది. ఒక్క ఆరెంజ్ పండు.. ప్రతి రోజూ ఒక్క ఆరంజ్ పండు ఆరగించడం వల్ల 60 మి.గ్రాములు కాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది. విటమిన్ డి కూడా ఉండటం వలన కాల్షియంను శరీరం త్వరగా గ్రహిస్తుంది. పెరుగు.. రోజులో కనీసం ఓకసారి పెరుగు తీనటం వలన 400 మి.గ్రాములు కాల్షియం ఉంటుంది. పాలకు బదులుగా పెరుగు తీసుకున్నా తగినంత కాల్షియం లభిస్తుంది. ఆకు కూరలు.. ఆకు కూరల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. తోట కూర, పాలకూర, బ్రొక్కోలి వంటి వాటితో పాటు పొటాషియం, మెగ్నీషియం కూడా లభిస్తుంది. కప్పు ఆకుకూరలో 336 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది.